మన చుట్టూ పరిసరాలను, మన ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. గురువారం కమలాపురం నగర పంచాయతీలో పర్యటిస్తూ, హోటల్స్, షాపుల యాజమాన్యాలతో మాట్లాడుతూ చెత్తను, తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా బుట్టల్లో వెయ్యాలని, రోడ్ల మీద చెత్త పారవెయ్యద్దు అని, మన చుట్టూ వున్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.