ఎమ్మెల్యే చొరవతో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం

59చూసినవారు
ఎమ్మెల్యే చొరవతో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం
రామసముద్రం మండలంలోని శీతరగానిపల్లికి ఆదివారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు. గత కొంతకాలంగా రోడ్డు అధ్వానస్థితిలో ఉండేది. విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా మండల గ్రాంటు రూ. 4 లక్షలు మంజూరు చేయించారు. దీంతో టీడీపీ మండలాధ్యక్షులు విజయ్ గౌడు రోడ్డుకు భూమిపూజ చేసి జేసీబీతో పనులు ప్రారంభించారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్