అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా అనర్హుడని బిజెపి ప్రొద్దుటూరు కన్వీనర్ శ్రీనివాసులు అన్నారు. గురువారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ, ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై పాలస్తిన అనే నినాదాలు చేయటం రాజ్యాంగ ఉల్లంఘించిన అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్రానికి లేఖ ద్వారా కోరుతున్నట్లు తెలిపారు. నేషనల్ లీగల్ అథారిటీ దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు.