ప్రొద్దుటూరు: "పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి"
పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రొద్దుటూరు వసంతపేటలోని సాయిబాబా గుడి వద్ద నుంచి పవర్ హౌస్ రోడ్డులోని విద్యుత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లొనే రూ. 16 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు. సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు.