ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మాజీ సీఎం జగన్ మంగళవారం లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయిండం.. సంప్రదాయాలకు విరుద్ధమని లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నట్లు ఉన్నారని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదన్నారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా అని జగన్ అన్నారు.