పులివెందులలోని తన నివాసంలో మంగళవారం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనకు వచ్చిన ఫిర్యాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.