చిన్నమండెంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం రాయచోటి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను తనిఖీలు చేసి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. సమస్యల పట్ల కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహరించి వారి సమస్యలను పరిష్కరించాలని సిబ్బందికి సూచనలు అందజేశారు.