లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట పంచాయితీలో రాళ్లపై ఉన్న జగన్ బొమ్మలను శుక్రవారం తొలగించారు. జగన్ ప్రభుత్వంలో భూ రీసర్వేలో భాగంగా శిలఫలకలకు, సర్వే రాళ్లకు జగన్ బొమ్మ వేసిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి వైసీపీ నాయకులు, కార్యకర్తలు దీనిపై ఎలా స్పందిస్తారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.