సంబేపల్లి: మద్యం తాగొద్దు అన్నందుకు యువకుడు ఆత్మహత్య

71చూసినవారు
సంబేపల్లి: మద్యం తాగొద్దు అన్నందుకు యువకుడు ఆత్మహత్య
సంబేపల్లి మండలం రౌతుకుంట గ్రామానికి చెందిన రాయదుర్గం రామాంజనేయులు బుధవారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యం తాగవద్దని ఇంట్లో మందలించడంతో రామాంజనేయులు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న సంబేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు