పెండ్లిమర్రి గంగనపల్లి కి చెందిన దాసరి శివాన్ష్ కు రూ. 2 లక్షలు సీఎం సహాయనిధి అందింది. శివాన్ష్ పేగు సంబంధిత సమస్యతో అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో తమ దీనస్థితిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ప్రత్యేక చొరవతో సీఎంఆర్ఎఫ్ ఎల్వోసి మంజూరు పత్రాన్ని గురువారం మంత్రి విజయవాడ లోని క్యాంపు కార్యాలయంలో బాధితుడి తండ్రి చంద్రశేఖర్ కి అందజేశారు.