రాయచోటి: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
రాయచోటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిదిలో మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా నెల రోజులు జైలు శిక్ష విధించారని రాయచోటి ట్రాఫిక్ సిఐ విశ్వనాథరెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. రూ. 10500/- చొప్పున ఎనిమిది మందికి జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.