అన్నమయ్య జిల్లాలో ఈనెల 25వ తేదీ నుండి పశుగణన ప్రారంభమవుతుందని, ఇందుకు సంబంధించిన అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లో ఆయన జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్లై తో కలిసి గోడపత్రాలు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పశుగణన ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.