సీతారాం ఏచూరి గొప్ప పోరాట యోధుడు: ఆకేపాటి

53చూసినవారు
సీతారాం ఏచూరి నిరంతర విప్లవ పోరాట యోధుడు, గొప్ప మేధావి మన నుంచి భౌతికంగా దూరం అవ్వడం చాలా బాధాకరం అని అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయచోటి ఎన్జీవో హోమ్ నందు సిపిఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పోరాట పటిమతో తన మేధా శక్తితో యువతను మేల్కొలిపే విధంగా ఆయన జీవితం సాగిందన్నారు.

సంబంధిత పోస్ట్