ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రభుత్వం ప్రస్తుతం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంపై సమీక్షిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎక్కడినుంచైనా తమ ఆస్తులు, భూములను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ విధానం అమల్లోకి తెచ్చారు. అయితే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల విధానంలో అక్రమాలు జరిగాయని భావిస్తున్న ప్రభుత్వం.. ఇందులో మార్పులు చేయనున్నట్లు తెలిసింది. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది.