ఏపీ అసెంబ్లీ: 2 బిల్లులు, 3 శ్వేతపత్రాలు

54చూసినవారు
ఏపీ అసెంబ్లీ: 2 బిల్లులు, 3 శ్వేతపత్రాలు
ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో రెండు బిల్లులు, మూడు శ్వేతపత్రాలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ ఒక బిల్లు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ అని పేరు మారుస్తూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణను రద్దు చేస్తూ మరో బిల్లు, రాష్ట్ర అప్పులు-ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతలు, మద్యం విధానం వల్ల జరిగిన ఘోరాలపై శ్వేతపత్రాలను ప్రకటించనుంది.

సంబంధిత పోస్ట్