ఆ వార్తలు అవాస్తవం: సీఎం చంద్రబాబు

50చూసినవారు
ఆ వార్తలు అవాస్తవం: సీఎం చంద్రబాబు
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం చేసిందనే వార్తలు అవాస్తవమని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల కోసం కేంద్రం తెలంగాణ, ఏపీకి రూ.3,300 కోట్లు విడుదల చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే వరద సాయంపై తమకు ఎలాంటి సమాచారం రాలేదని చంద్రబాబు చెప్పారు. తాము ఇంకా వరదనష్టంపై నివేదిక పంపించలేదన్నారు. రేపు ఉదయం వరదనష్టం నివేదికను పంపిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్