6న ఏపీ ఐసెట్ పరీక్ష

68చూసినవారు
6న ఏపీ ఐసెట్ పరీక్ష
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఐసెట్-2024 పరీక్షను ఈ నెల 6న నిర్వహిస్తున్నట్లు సెట్ చైర్మన్, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి హుస్సేన్ రెడ్డి తెలిపారు. వర్సిటీలోని తన ఛాంబర్‌లో ఆయన మాట్లాడుతూ. ఈ పరీక్షకు మొత్తం 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఏపీలో 111, తెలంగాణలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్