ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కోరిక తీర్చలేదని కోడలినే మామ హతమార్చాడు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం నాగటూరులో ఘటన వెలుగు చూసింది. పొలంలో పనిచేసుకోవడానికి వెళ్లిన కోడలిపై మామ అత్యాచారయత్నం చేశాడు. ఈ క్రమంలో మామ నుంచి తప్పించుకోవడానికి కోడలు ప్రయత్నించింది. దీంతో కోపంతో కోడలు శిరీషను బండరాయితో కొట్టి ముఖాన్ని నుజ్జు నుజ్జు చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదైంది.