AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను మంత్రి నారా లోకేశ్ సోమవారం విడుదల చేయనున్నారు. దీని కోసం విద్యాశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ పరీక్షల్లో మొత్తం 3,68,661 మంది హాజరయ్యారు. ఇటీవల టెట్ ఫైనల్ కీని విడుదల చేశారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.