మీరు డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్నారా? అయితే చలికాలంలో జర జాగ్రత్త అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చలికి భయపడి కొందరు వ్యాయామాలు చేయకపోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలా జరగకూడదంటే శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ఉన్ని దుస్తులు ధరించాలి. వాకింగ్, రన్నింగ్ వంటివి చేయాలి. తాజా కూరగాయలు, పండ్లు రెగ్యులర్ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా డైట్ పాటిస్తూ మందులు వేసుకోవాలి.