AP : రాష్ట్రంలోని 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్రశిక్షా అభియాన్ ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఈనెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వెబ్ సైట్ https://apkgbv.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీడీ సూచించారు. సమస్యలు, సందేహాలు ఉంటే 7075159996, 7075039990 నంబర్లకు సంప్రదించాలన్నారు.