ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్ష తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. 8 నోటిఫికేషన్లకు సంబంధించి ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పూర్తి విరరాలకు అధికారిక https://portal-psc.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఏపీపీఎస్సీ వెల్లడించింది.