AP: సీఎం చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సీఎం బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనకు అధికారులను బాధ్యులను చేయడం దారుణమన్నారు. 'చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో 20 మందికిపైగా మరణించారు. కందుకూరు ర్యాలీలో 8 మంది, గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. తిరుపతిలో ఆరుగురు చనిపోయారు. బాబు ఎక్కడుంటే అక్కడ మరణాలే' అని ఆయన వ్యాఖ్యానించారు.