టీంఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి వార్తల్లో నిలిచారు. హిందీ భాష కేవలం అధికార భాష మాత్రమేనని, జాతీయ భాష కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని ఓ ప్రైవేట్ కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొన్న అశ్విన్ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఈ టాపిక్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అంతర్జాతీయ టెస్ట్ మ్యాచులకు అశ్విన్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.