భారత్‌లో లాక్‌డౌన్ అంటూ ప్రచారం.. స్పందించిన PIB

52చూసినవారు
భారత్‌లో లాక్‌డౌన్ అంటూ ప్రచారం.. స్పందించిన PIB
భారత్‌లోకి HMPV ప్రవేశించడంతో వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సైతం 'లాక్‌డౌన్' థంబ్ నెయిల్స్‌లో ఆసత్యపు ప్రచారం చేస్తుండటంతో కేంద్రానికి చెందిన PIB FACTCHECK స్పందించింది. కేంద్రం అలాంటి నిర్ణయమేది తీసుకోలేదని.. ఇలాంటివి నమ్మి ఆందోళన చెందొద్దని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకూ ఏ విషయాన్నీ నమ్మొదని తెలిపింది.

సంబంధిత పోస్ట్