వికారాబాద్ ఫారెస్ట్‌లో రాడార్ ఏర్పాటుతో ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన దామగుండ రామలింగేశ్వర స్వామి ఆలయం మనుగడకు ప్రమాదం ఏర్పడనుందని, ఆ ప్రాంతం మొత్తం కాలుష్య కోరల్లో చిక్కుకోనుందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. ప్రసిద్ధిగాంచిన రామలింగేశ్వరున్ని దర్శించుకోవాలనే భక్తుల కోరిక దినదిన గండంగా మారనుందని, గుడికి వెళ్లాలంటే ఇకమీదట ఆంక్షలు విధించనున్నారని వెల్లడించారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రాజెక్టులు అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.