AP: నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిపై ఎల్లయ్య అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో గట్టిగా కేకలు వేసింది. స్థానికులు గమనించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.