పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు

63చూసినవారు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు
AP: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ నెల 13న పాల్వాయి గేటులోని పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేస్తుండగా.. అడ్డుకోబోయిన తనపై దాడి చేసినట్లు టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేర‌కు 307 సెక్షన్‌ కింద పిన్నెల్లిపై కేసు నమోదు చేశామని రెంటచింతల పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్