తల్లిపాల ఆవశ్యకతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO), యూనిసెఫ్ లు ప్రతి బిడ్డకు తల్లిపాలు పట్టాలని సూచిస్తున్నాయి. శిశువు పుట్టిన గంటలోపు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని, కనీసం 6 నెలల పాటు కొనసాగించాలని సిఫార్సు చేశాయి. అయితే బిడ్డ పూర్తిగా అభివృద్ధి చెందాలంటే కనీసం రెండు సంవత్సరాలు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని చెబుతున్నాయి. పేద దేశాలు సహా అమెరికా లాంటి అగ్రదేశాల్లో కూడా తల్లిపాలు ఇయ్యని మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది.