భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. 'అనంతపురం, అమరావతి, విశాఖలో గోల్ఫ్ కోర్సులు పెడతాం. ఏపీ అంబాసిడర్‌గా ఉండాలని కపిల్‌దేవ్‌ను కోరారు. రాష్ట్రంలో గోల్ఫ్ అభివృద్ధి చేయాలనే యోచనలో ఉన్నాం. గోల్ఫ్ డ్రైవింగ్‌కు రేంజ్‌లు సిద్ధం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ క్రీడాకారులను వెలికి తీస్తాం' అని ఆయన స్పష్టం చేశారు.