బాలింతను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు పడ్డ కష్టం అందర్నీ కలచివేసింది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండలో చోటు చేసుకుంది. బాలింతను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి ఆమెను తన భుజంపై మోసుకుని పెద్దేరువాగు దాటించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.