అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ ప్రయోగం ద్వారా దోషికి మరణశిక్ష అమలు చేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. తాజాగా ఈ పద్ధతిలో రెండోసారి శిక్ష అమలు చేశారు. పని చేసే చోట ముగ్గురిని హతమార్చిన కేసులో దోషిగా తేలిన యుగెని మిల్లర్ అనే వ్యక్తికి దక్షిణ అలాబామాలో గురువారం ఈ శిక్షను అమలు చేశారు. ఆయన ముఖానికి మాస్క్ బిగించిన అధికారులు ఆ తర్వాత నెట్రోజన్ గ్యాస్ పంపడం మొదలుపెట్టారు. ఎనిమిది నిమిషాల్లో అతను మరణించాడు.