AP: మాజీ మంత్రి బాలినేని వైసీపీకి రాజీనామా చేయడంతో పార్టీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నాయకులతో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల ముఖ్య నేతలతో జగన్ మాట్లాడారు. జిల్లాల్లో పార్టీ పరిస్థితి, కార్యకర్తల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంక్ ఉందని గుర్తుచేశారు.