గతంలో క్యూలైన్లలో భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు, మజ్జిగ, పాలు వంటి పానీయాలతో పాటు సాంబారు అన్నం, టిఫిన్లు అందించే వారు. వైసీపీ హయాంలో కరోనా పేరుతో వాటిని నిలిపివేశారు. కరోనా తర్వాత వాటిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించలేదు. చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు మధుమేహం వున్న వారితో వస్తున్న కుటుంబాలు క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రుచికి, శుచికి పేరుపడిన శ్రీవారి అన్న ప్రాసాదాలలో నాణ్యత కరువైందని, ఉడకని అన్నం, పలుచని సాంబారు పెట్టారని ఐదేళ్లుగా ఫిర్యాదులొచ్చాయి.