కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం రెవెన్యూ గ్రామసభ నిర్వహిస్తున్నట్లు మండల తహశీల్దార్ జి. వి సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో రీ- సర్వే పూర్తయిన భూములకు సంబంధించి ఉదయం 10 గంటలకు గ్రామ సచివాలయం ఆవరణంలో గ్రామ సభ జరుగుతుందని భూములకు సంబంధించిన సమస్యలను ఈ గ్రామ సభ ద్వారా యజమానులు పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు.