అన్నపర్రు వైసిపి కార్యకర్తలు తెదేపాలో చేరికలు

57చూసినవారు
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామానికి చెందిన 20 మంది వైయస్సార్ పార్టీ కార్యకర్తలు గ్రామ తెదేపా నాయకుడు కొలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం పెదనందిపాడు తెదేపా కార్యాలయంలో కూటమి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. బూర్ల వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలని బూర్ల వారికి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్