కొత్త నందాయ పాలెంలో గ్రామసభ
కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ అభివృద్ది గురించి, గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి చర్చించారు. అలాగే ప్రభుత్వం వచ్చిన తరువాత వంద రోజులలో జరిగిన కార్యక్రమాల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి తాండ్ర సాంబశివరావు, ఎలిషా బాబు, ఏపిఎం శ్రీనివాస రెడ్డి, ఉపసర్పంచ్ వెంకట రెడ్డి, మాజీ సర్పంచ్ రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.