చెత్త సేకరణ నిలిచిపోవడంతో పేరుకుపోయిన వ్యర్ధాలు
By Adapa ashok kumar 545చూసినవారుచిలకలూరిపేట నియోజకవర్గం, పట్టణంలోని ఒకటో డివిజన్ పరిధిలో శానిటరీ ఇన్సెపెక్టర్, మున్సిపాలిటీలోని అధికారికి మధ్య నెలకొన్న విబేధాలతో గత కొన్ని రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. వీరి మధ్య విభేదాల కారణంగా చెత్త సేకరణలో నిర్లక్ష్యం ప్రజలు రోగాల బారిన పడేల చేస్తోంది. రహదారుల పక్కన చెత్త దుర్వాసన వెదజల్లుతూ ఉంది. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.