తిరుపతి ఘటనలో ఆరుగురు మృతి చెందడం దురదృష్టకరమని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఘటనకు గల కారణాలను నిగ్గుతేల్చి, తప్పు చేసిన వారిని కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందేలా స్థానిక వైద్య సిబ్బంది, టీటీడీ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.