గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గురువారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ 98 శాతం అధికారులు పూర్తి చేశారని కమిషనర్ హరికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో మొత్తం 58, 971 మంది పెన్షనర్లకు గాను 57, 703 మందికి పెన్షన్లు అందజేశారు. వివిధ కారణాల వలన అందుబాటులో లేని 1, 268 మంది పెన్షనర్లకు శుక్రవారం ఉదయం అందించనున్నారు. ప్రణాళికాబద్ధంగా నగర పరిధిలో పెన్షన్ల పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు.