గుంటూరు: 2026 నాటికి అరండల్ పేట ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేస్తాం

85చూసినవారు
భూ యజమానులకు ఎలాంటి నష్టం జరగకుండా గుంటూరులోని అరండల్ పేట ఓవర్ బ్రిడ్జిని విస్తరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్ లో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. గుంటూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుంటూరు నగర ప్రజలకు మరింత సౌకర్య వంతంగా ఉండే విధంగా అభివృద్ధి పనులు పూర్తిచేస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్