నగరపాలక సంస్థ కమిషనర్ గా హరికృష్ణ బాధ్యతల స్వీకరణ

78చూసినవారు
నగరపాలక సంస్థ కమిషనర్ గా హరికృష్ణ బాధ్యతల స్వీకరణ
గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా ఎస్. హరికృష్ణ (ఎఫ్ఎసి) బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కీర్తి చేకూరి బదిలీ అనంతరం ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ ను కమిషనర్ నియమించినప్పటికి ఆయన రాక ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ లో రీజనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న హరికృష్ణను గుంటూరు కార్పొరేషన్ కమిషనర్ గా నియమించారు.

సంబంధిత పోస్ట్