గుంటూరులో శుక్రవారం శాకంబరీ దేవి ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. డొంక రోడ్డు కాకుమాను వారి తోటలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో వివిధ రకాల కూరగాయలు, పుష్పాలతో అలంకరించారు. భక్తులు అమ్మవారికి ఆషాడ మాసం సారే తీసుకువచ్చారు. నగర పురవీధుల్లో అమ్మవారిని గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వహకులు తీర్థప్రసాద వితరణ చేశారు.