వాకింగ్ ట్రాక్ ని పరిశీలించిన కమిషనర్

79చూసినవారు
వాకింగ్ ట్రాక్ ని పరిశీలించిన కమిషనర్
ప్రజలకు ఆరోగ్యం, ఆహ్లాదాన్ని అందించే వాకింగ్ ట్రాక్స్ అభివృద్ధికి జీఎంసీ కృషి చేస్తుందని, వాకర్స్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. సోమవారం కొరిటెపాడు చెరువు వాకింగ్ ట్రాక్ ను అధికారులు, స్థానిక వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. కొరిటెపాడు చెరువులో చేపట్టిన అభివృద్ధి పనులు అసంపూర్ణంగా ఉన్నాయని చెప్పారు.