కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన సాధారణ పర్యవేక్షణ 2024-2025 సంవత్సరానికి (దశ-1) నిర్వహించటానికి జాతీయస్థాయి పర్యవేక్షకులు బుధవారం గుంటూరు జిల్లాకు విచ్చేశారు. ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సూర్య కాంత, కలెక్టర్ నాగలక్ష్మిని కలిశారు. అనంతరం కలెక్టర్, డీఆర్డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు.