గుంటూరు: పెంచి పోషించిన కూతురు తల్లిని నడిరోడ్డుపై వదిలేసింది
గుంటూరు జిల్లా రమాదేవికి ఒక్కగానొక్క కుమార్తె. చిన్నప్పటి నుంచి ఆమెను పెంచి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగితో వివాహం చేసింది. కానీ తల్లిని వదిలించుకోవాలనుకున్న కూతురు, మతిస్థిమితం కోల్పోయిన తల్లిని విజయవాడ వృద్ధాశ్రమంలో చేర్పించింది. వరద సమయంలో ఇంటికి తీసుకెళ్లిన తర్వత, శుక్రవారం బైక్పై వృద్ధాశ్రమానికి తీసుకువెళ్ళి వదిలి వెళ్లింది. అటు ఆమెను వారు తీసుకెళ్లక, ఇటు కూతురు వదిలి వెళ్లడంతో ఆమె గేటు వద్ద ఇలా దీనస్థితిలో వేచి చూస్తుంది.