11కే వీ విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం గుంటూరులో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గుంటూరు వీఎస్వీఎన్ కాలనీ, నేతాజీనగర్, తారకరామనగర్, నవభారత్ నగర్ 1, 2, 4 లైన్లు, సిద్దార్థ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.