తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తాజాగా తీసుకున్న నిర్ణయాలు రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అసలు నియామకాలు కూడా రాజకీయ ప్రేరేపితంగానే జరిగాయని అన్నారు. గుంటూరు సిద్ధార్థనగర్ లోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. బీఆర్ నాయుడుకి ఛైర్మన్ పదవిని ఏ ఉద్దేశ్యంతో ఇచ్చారని ప్రశ్నించారు.