ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపై వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు విజయకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పిరెడ్డి వల్ల పార్టీ సర్వనాశనం అయిందన్నారు. వైసీపీలో బ్రాహ్మణ కులానికి అన్యాయం జరుగుతుందన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించటం లేదన్నారు. ఎన్నో ఆరోపణలు ఉన్న వ్యక్తి కార్పొరేటర్ ఆచారికి నగర అధ్యక్షుడు పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు.