దాచేపల్లి: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

68చూసినవారు
దాచేపల్లి: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
దాచేపల్లి మండలం నడికుడిలో అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం కుంచల సాంబయ్య కుమారుడు నరేంద్ర(24) గతేడాది ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప పంటలను సాగు చేశాడు. పంట దిగుబడి సరిగా రాక రూ.6 లక్షలు అప్పులయ్యాయి. దాన్ని ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై, గురువారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్